అటకపై వర్మ ‘అటాక్’... కారణం పూరి జగన్నాథే!
on Mar 14, 2016

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ - ప్రకాష్ రాజ్ - జగపతి బాబుల క్రేజీ కాంబినేషన్ లో రూపొందించిన 'అటాక్' చిత్రం ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. ఇప్పటికే ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఇంకా త్వరలో.. అనే మాటతో మాత్రమే అంతో ఇంతో ఉనికిని చాటుకొంటోంది. కాగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాలకు కారణం పూరీ జగన్నాథే అంటూ ప్రచారం జరుగుతోంది ఫిల్మ్ నగర్ లో. అసలు విషయం ఏమిటంటే.. ‘అటాక్’ నిర్మాత సి.కళ్యాణ్ తో వరుసగా జ్యోతిలక్ష్మి - లోఫర్. సినిమాలు తీశాడు పూరీ జగన్నాథ్. జ్యోతిలక్ష్మి తనపై పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చింది కానీ.. ‘లోఫర్’ మాత్రం కళ్యాణ్ కు గట్టి దెబ్బే కొట్టింది. బయ్యర్లు దారుణమైన నష్టాలు చవిచూడ్డంతో ‘అటాక్’ను విడుదల చేసుకోవడం కష్టంగా మారింది. పాత లెక్కలు తేలిస్తే తప్ప ‘అటాక్’ను కొనడానికి బయ్యర్లు ముందుకు రావట్లేదు. ఈ పరిస్థితుల్లో ‘అటాక్’ ఇప్పుడిప్పుడే విడుదలవడం కష్టమే అనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



