చిరు కోసం చరణ్ వెయిటింగ్!!
on Oct 20, 2018
అవును చిరంజీవి కోసం రామ్ చరణ్ ఈగర్లీ వెయిటింగ్. ఎందకనుకుటున్నారా? రామ్ చరణ్ , బోయపాటి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈసినిమాకు సంబంధించిన టైటిల్ కానీ ఫస్ట్ లుక్ కానీ ఇంత వరకు బయటకు రాలేదు. మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టైటిల్ ఏంటి? ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది ? అంటూ అభిమానుల్లో పలు రకాల ప్రశ్నలు మొదలయ్యాయి. దసరా పండుగ కానుకగా ఫస్ట్ లుక్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది.
దీంతో త్వరలో సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట చిత్ర యూనిట్. అది ఎప్పుడంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి `సైరా` సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్లారు. త్వరలో అక్కడ షెడ్యూల్ పూర్తి కానుంది. చిరంజీవి ఎప్పుడు హైదరాబాద్ వస్తే అప్పుడు చరణ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. `వినయ విధేయ రామ` టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చిరంజీవి వచ్చాకే అన్ని కన్ ఫర్మ్ అయ్యే అవకాశాలున్నాయి. సో లెట్స్ వెయిట్ ఫర్ మెగాస్టార్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
