రాజమౌళి ముద్దు.. 100 కోట్లు వద్దు!
on Oct 20, 2018

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్'కి డివివి దానయ్య నిర్మాత. 'బాహుబలి'తో జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా... అదీ 'బాహుబలి' తరవాత తీస్తున్న సినిమా కావడంతో 'ఆర్‌ఆర్‌ఆర్'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకని, ఈ సినిమాను 'బాహుబలి' రెండు భాగాలను నిర్మించిన ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని టేకోవర్ చేయాలని ప్రయత్నించినట్టు ఫిలింనగర్ సమాచారం. రాజమౌళి సినిమాను తమకు వదిలేస్తే రూ. 100 కోట్లు ఇస్తామని నిర్మాత డివివి దానయ్యకు ఆఫర్ ఇచ్చార్ట! శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్రతిపాదనను దానయ్య సున్నితంగా తిరస్కరించారని తెలుస్తుంది.
'ఆర్‌ఆర్‌ఆర్' రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. బడ్జెట్ సుమారు రూ. 300 కోట్లు అని అంచనా వేస్తున్నారు. సినిమా స్టార్ట్ చేయకముందు వంద కోట్లు ప్రాఫిట్ అంటే టెంప్టింట్‌గా వుంటుంది. కానీ, దానయ్య మాత్రం టెంప్ట్ కాలేదు. 'బాహుబలి' తరవాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా తన సంస్థలో కావడం తనకు గర్వకారణమని భావిస్తున్నార్ట. అందుకని, సినిమాను వదులుకోవడానికి ఇష్టపడలేదట. బడ్జెట్ 300 కోట్లు ఈజీగా రికవరీ అవుతుందని ఆయన ధీమా కూడా సినిమా వదులుకోకపోవడానికి ఒక కారణం కావొచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



