ధృవ కోసం చెమటోడుస్తున్న రామ్ చరణ్..!
on May 6, 2016

తమిళంలో సూపర్ హిట్టయిన తనీ ఒరువన్ సినిమాను రామ్ చరణ్ హీరోగా, సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగం షెడ్యూల్ పూర్తి కావాల్సి ఉన్నా, శ్రీజ పెళ్లి కారణంగా, షూట్ ను ఆలస్యంగా మొదలుపెట్టారు. సినిమాలో చెర్రీది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్. ఇప్పటికే ఫిట్ గా ఉన్నా, ఆ పాత్రకోసం ఇంకా బరువు తగ్గాలని రామ్ చరణ్ భావించాడట. అందుకే గంటల తరబడి జిమ్ వర్కవుట్లతో పాటు, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ లాంటివి చేస్తూ కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. బ్రూస్లీ తో డిజాస్టర్ ఎకౌంట్లో యాడ్ అవడంతో, చెర్రీకి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఇంత కసిగా సినిమాకు పనిచేస్తున్నాడని మూవీ వర్గాలంటున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమాకు ధృవ అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ సినిమాలో, రకుల్ ప్రీత్ రెండో సారి చరణ్ తో జతకడుతోంది. తనీ ఒరువన్ లో విలన్ గా చేసిన హీరో అరవింద్ స్వామి తెలుగులోనూ అదే పాత్రను చేస్తుండటం విశేషం. సినిమా దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



