మరో రికార్డు బుక్ లో దిగ్దర్శకుడి పేరు..!
on May 6, 2016
.jpg)
దర్శకరత్న దాసరి నారాయణరావు కేవలం దర్శకుడిగానే కాక నటుడిగా, నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలను తెలుగు ప్రజలకు అందించారు. తన సుదీర్ఘ ప్రయాణంలో 151 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి పేరును గతంలోనే ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్, లిమ్కా బుక్ లు తమ పుస్తకాల్లో రాసుకున్నాయి. తాజాగా డా. చింతపట్ల వెంకటాచారి స్థాపించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా దాసరి పేరును లిఖించారు. రీసెంట్ గానే పుట్టిన రోజును జరుపుకున్న దాసరికి ఇది కాస్త లేటుగా వచ్చిన బర్త్ డే గిఫ్ట్ అంటున్నారు ఆయన అభిమానులు. కాగా తన నిర్మాణంలో పవన్ తో ఒక సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన దాసరి, తన కలల ప్రాజెక్ట్ మహాభారతాన్ని తెరకెక్కించిన తర్వాత సినిమా రంగానికి దూరమవుతానని నిర్ణయించుకున్నారు. మరో వైపు ఆయన అభిమానులు మాత్రం, దాసరి సినీరంగంలో కొనసాగాలని, ఆయన సేవలు అవసరమని కోరుకోవడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



