రామ్ చరణ్ బయటపెట్టిన నిజాలు!
on Oct 10, 2019

'సైరా నరసింహారెడ్డి'కి రామ్ చరణ్ నిర్మాత మాత్రమే. అందులో హీరో కాదు, చిన్న పాత్రలోనూ నటించలేదు. అందుకని, 'సైరా' ప్రచార కార్యక్రమాల్లో నిర్మాతగా మాట్లాడాడు. ఆయన మాటల్లో కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. సినిమా విడుదల తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదలకు ముందు నిద్రలేని రాత్రులు గడిపానని నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు. త్రివిక్రమ్ కి తండ్రి చిరంజీవితో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదైనా షెడ్యూల్లో సినిమా బడ్జెట్ పెరిగితే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించాడు.
"కొన్నిసార్లు బడ్జెట్ ఎక్కువైన తర్వాత పెద్ద మీటింగ్ పెట్టేసి, సినిమాను ఆపి, మళ్ళీ ఆలోచించి చేస్తారు. 'సైరా'కు అలా జరిగితే బయట బోలెడు మాటలు వస్తాయి. బడ్జెట్ సమస్యల వల్ల సినిమా ఆగిందనీ, మళ్ళీ రీవిజిట్ చేస్తున్నారనీ ప్రచారం జరిగితే బయటకు బ్యాడ్ టాక్ వెళుతుంది. కుటుంబ సభ్యుడు అయితే జంకకుండా, భారీ బడ్జెట్ అయినా వెనుకంజ వేయకుండా, అర్థం చేసుకుని చేస్తారని అనుకున్నాం. ఏ విధంగానూ సినిమా ఆగకూడదని అనుకున్నాం. నాన్నగారికి ఆ కథపై ఉన్న గౌరవంతో నేను నిర్మాతగా మారాను" అని రామ్ చరణ్ అన్నాడు.
ఫ్లోలో 'సైరా' గురించి రామ్ చరణ్ మాట్లాడినా... ఇండస్ట్రీలో ఫ్యాక్ట్స్ బయటపెట్టాడని ఫిలింనగర్ సర్కిల్స్ లో ఇన్నర్ టాక్. భారీ బడ్జెట్ సినిమాలకు ఒక షెడ్యూల్ కి మరో షెడ్యూల్ కి మధ్యలో లాస్ట్ షెడ్యూల్ లో ఎంత బడ్జెట్ అయిందని లెక్కలు వేసుకోవడం, మీటింగులు గట్రా ఉంటాయి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే, అతడి మార్కెట్ కి మించి ఖర్చు చేయాలంటే నిర్మాతలు ఆలోచిస్తారు. రామ్ చరణ్ నోటి నుండి ఆ నిజాలు బయటకొచ్చాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



