కొత్త ప్రేమికుడి కోసం శ్రుతి హాసన్ వెయిటింగ్
on Oct 10, 2019

ఒకసారి ప్రేమలో వైఫలమైతే... మరోసారి ప్రేమలో పడకూడదని నియమ నిబంధనలు ఏమీ లేవు. జీవితంలో ఒక్కరిని మాత్రమే ప్రేమించాలని, ఒక వ్యక్తితో బ్రేకప్ అయిన తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో పడకూడని ఎవరూ రాజ్యాంగంలో రాయలేదు. సో... మళ్ళీ ప్రేమలో పడాలని శ్రుతి హాసన్ ఎదురు చూడటంలో తప్పేం లేదు. అసలు వివరాల్లోకి వెళితే... లండన్ బేస్డ్ ఇటాలియన్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సెల్, శ్రుతి హాసన్ కొన్నాళ్ళు ప్రేమలో మునిగి తేలడం, షికార్లు చేయడం, తర్వాత బ్రేకప్ కావడం తెలిసిన విషయాలే. అతడితో విఫల ప్రేమ బంధం గురించి మంచు లక్ష్మి టాక్ షోలో శ్రుతి హాసన్ మాట్లాడారు.
"నేను అమాయకురాలిని కావడంతో నా చుట్టూ ఉన్నవాళ్లు నా బాస్ లా ఉంటారు. మనం సుఖాల్లో ఉన్నప్పుడు మంచి వ్యక్తుల్లా ఉన్నవాళ్లు, మనకు కష్టాలు వచ్చినప్పుడు చెడ్డ వ్యక్తుల్లా మారతారు" అని శ్రుతి అన్నారు. బహుశా... ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు మైఖేల్ అండగా నిలబడకుండా ఉండి ఉండవొచ్చు. ఏది ఏమైనా అతడితో ప్రేమ బంధం తనకు గొప్ప పాఠాన్ని నేర్పిందని శ్రుతి హాసన్ అన్నారు. అలాగని, ప్రేమపై తనకు చెడు అభిప్రాయం లేదని.. గొప్ప ప్రేమికుడి కోసం ఎదురు చూస్తున్నానని... అతడుతారసపడినప్పుడు ఇన్నాళ్లూ నేను ఎదురుచూసింది ఇటువంటి వ్యక్తి కోసమేనని సంతోషంగా చెబుతానని శ్రుతి హాసన్ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



