చరణ్, రావిపూడి.. ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్?
on Aug 5, 2021

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ మాములుగా లేదసలు. ఒకవైపు `ఆచార్య`, `ఆర్ ఆర్ ఆర్` చిత్రీకరణ తుది దశకు చేరుకుంటే.. మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ సినిమాని అతి త్వరలో పట్టాలెక్కించనున్నాడు చరణ్. అంతేకాదు.. కేవలం ఐదు నెలల్లో శంకర్ కాంబినేషన్ మూవీని ఫినిష్ చేసేలా స్కెచ్ వేశాడని బజ్.
ఇదిలా ఉంటే.. శంకర్ డైరెక్టోరియల్ తరువాత రామ్ చరణ్ చేయబోయే సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. `పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `సరిలేరు నీకెవ్వరు` చిత్రాలతో వరుస విజయాల దర్శకుడిగా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడితో చరణ్ నెక్స్ట్ వెంచర్ ఉండబోతోందట. అంతేకాదు.. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మించబోతోందని సమాచారం. త్వరలోనే చరణ్, రావిపూడి కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానుంది.
కాగా, ప్రస్తుతం అనిల్ రావిపూడి చేతిలో `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్ 3` ఉంది. విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ 2022 సంక్రాంతికి రిలీజ్ కానుందని వినికిడి. ఆపై నటసింహం బాలకృష్ణతో ఓ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు అనిల్. అదయ్యాకే చరణ్ ని డైరెక్ట్ చేసే అవకాశముందంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



