సిద్ధివినాయక ఆలయంలో అయ్యప్ప దీక్ష పూర్తి చేసిన చరణ్!
on Oct 4, 2023
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ ఆ తర్వాత మెగా పవర్ స్టార్ గా, గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తీరు అందరికి విదితమే. తాను ఎంత పెద్ద స్టార్ అయినా కూడా తనని గొప్ప స్థాయికి తీసుకొచ్చిన భగవంతుడికి మాత్రం చరణ్ ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటాడు.షూటింగ్ ల్లో బిజీ గా ఉన్నా కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అయ్యప్ప దీక్ష తీసుకొని భక్తి శ్రద్ధలతో దీక్షని నిర్వర్తించి అయ్యప్ప అనుగ్రహం పొంది దీక్ష విరమణ కోసం శబరిమలై వెళ్లే చరణ్ ఈ సారి ముంబై నగరంలోని ప్రసిద్ధ సిద్ధి వినాయకుడి ఆలయంలో అయ్యప్ప దీక్ష విరమణ చెయ్యడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలుగు చలన చిత్ర చరిత్రకి సంబంధించిన పుస్తకంలో ఎప్పటి కప్పుడు తనకంటూ ఒక పేజీ ఉండేలా చేసుకుంటున్న నటుడు రామ్ చరణ్. తన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులని బద్దలు కొట్టిన చరణ్ ఎన్నో విజయవంతమైన సినిమా ల్లో నటించి టాలీవుడ్ లో ఉన్న అగ్రకథానాయకుల్లో ఒకడిగా పేరు ని సంపాదించాడు. అలాగే ఇటీవలే సినిమానే ఎప్పుడు నెంబర్ వన్ గా ఉండాలనే ఉద్దేశం తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి భారతీయ సినిమా పరిశ్రమ మొత్తాన్ని తన నట విశ్వరూపం తో ఒక ఊపు ఊపాడు.ఇప్పడు గేమ్ చేంజర్ మూవీ ద్వారా పాన్ ఇండియా లెవెల్లో మరో సారి తన సత్తాన్ని చాటడానికి సిద్ధం అవుతున్నాడు.
ఇంక అసలు విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం ప్రతి సంవత్సరం లాగానే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొన్నాడు.ఎవరైనా సరే అయ్యప్ప దీక్ష తీసుకొని ఉంటే దీక్ష విరమణని అయ్యప్ప జన్మ స్థలమైన శబరిమలలో చేస్తారు. కానీ చరణ్ మాత్రం ముంబై లో అత్యంత ఫేమస్, పవర్ ఫుల్ అయిన సిద్ధి వినాయక స్వామి టెంపుల్ లో దీక్ష విరమణ చేసాడు. చరణ్ ని చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు సిద్ధి వినాయక ఆలయం ప్రాంతానికి చేరుకోవడం తో పోలీసు లు భారీ ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేసారు. బాలీవుడ్ కి చెందిన కొంత మంది ప్రముఖులు కూడా చరణ్ తో పాటు పాల్గొన్నారు.కాగా చరణ్ తన అయ్యప్ప దీక్షని వినాయకుడి గుడిలో విరమించటం టాక్ అఫ్ ది డే మాత్రం అయ్యింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
