రోగనిరోధక శక్తి... రకుల్ చెప్పిన చిట్కా
on Apr 22, 2020

భోజనం రుచికరంగా ఉండడం ముఖ్యమా? రోగనిరోధక శక్తి పెంచే భోజనం చేయడం ముఖ్యమా? అని ప్రజలను అడిగితే... రెండో మాటకు ఓటు వేస్తున్నారు. బయట మంచి రెస్టారెంట్‌కి వెళ్లి బిర్యానీ తిందామనే ఆలోచన ఎప్పుడో పోయింది. షవర్మాలను మర్చిపోయారు. ఇంటిపట్టున వండుకుని తింటున్నారు. ఇన్ ఫాక్ట్... రోగనిరోధక శక్తి పెంచే ఆహారం వైపు చూస్తున్నారు. అటువంటి ప్రజలకు రకుల్ ప్రీత్ సింగ్ మంచి చిట్కా ఒకటి చెప్పారు.
రాశి చౌదరి అని రకుల్‌కి స్నేహితురాలు ఉన్నారు. ఆవిడ న్యూట్రీషియనిస్ట్. ఆవిడ చెప్పిన ఒక చిట్కాను ప్రేక్షకులతో పంచుకున్నారు. మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటే మీరు చేయవలసిందల్లా...
అరలీటరు మంచి నీరు తీసుకోండి.
అందులో కొంచెం అల్లం, మిరియాలు, పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు వేయండి.
స్టవ్ మీద పెట్టి అరలీటరు నీరు కాస్త పావు లీటరు అయ్యేవరకు బాగా మరిగించండి.
చల్లారిన తర్వాత ఆ నీటిని తాగండి.
రుచి కోసం తేనెను కలుపుకోవచ్చు.
రకుల్ చెప్పిన చిట్కా ఇదే. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవారు ఫాలో అవ్వండి మరి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



