టీవీ9తో పోలిస్తే సాక్షి వరస్ట్!
on Apr 22, 2020
మీడియా మీద సెటైర్స్ వేయడంలో సినిమా వాళ్లది ఎప్పుడూ బ్యాక్ సీటే! పొలిటికల్ వాళ్లు అయితే ఫ్రంట్ సీట్ తీసుకుంటారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసి ప్రసారం చేసే ఛానళ్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కమెడియన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి, తర్వాత స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు ప్రొడ్యూస్ చేసి, రాజకీయాల్లోకి రెండు అడుగులు వేసి ‘సెవన్ ఓ క్లాక్ బ్లేడ్’తో సెన్సేషన్ సృష్టించిన బండ్ల గణేష్ ఉన్నారు కదా! ఆయనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన ‘సాక్షి’ ఛానల్ ఎప్పుడైనా, ఏవైనా వ్యతిరేక వార్తలు రాసి ప్రసారం చేసిందేమో? టీవీ9 కంటే ‘సాక్షి’ వరస్ట్ ఛానల్ అని బండ్ల గణేష్ తెల్చారు. సోషల్ మీడియాలో కొందరు వెరైటీ పోస్టులు చేస్తుంటారు. పోల్, సర్వే టైపులో! లైకులు, రీట్వీట్ల ఆధారంగా కొన్ని డిసైడ్ చేస్తారు.
అలేఖ్యారెడ్డి పేరుతో ఫ్రొపైల్ ఉన్న ఒక అకౌంట్ నుండి పోస్ట్ వచ్చింది. ‘వరస్ట్ ఛానల్ ఏది? టీవీ9 అయితే రీట్వీట్ కొట్టండి. సాక్షి అయితే లైక్ చేయండి. షేమ్ ఆన్ టీవీ9’ అని! దానికి బండ్ల గణేష్ లైక్ కొట్టారు. అంటే... అర్థం సాక్షి వరస్ట్ ఛానల్ అనే కదా! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సాక్షిని ఎంతగా లైక్ చేస్తారో... కొందరు అంతగా హేట్ చేస్తారు. బండ్ల గణేష్ హేట్ చేయడానికి కారణాలు ఏంటో ఆయనే చెప్పాలి.