డ్రగ్ కాంట్రవర్సీ తరవాత తొలిసారి బయటకొచ్చిన రకుల్
on Sep 19, 2020

డ్రగ్ కేసును పక్కనపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ తన పని తాను చేసుకుంటోంది. కొన్ని రోజులుగా మీడియాలో ఆమె పేరు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. రకుల్ కూడా డ్రగ్స్ తీసుకుందని రియా చక్రవర్తి చెప్పినట్టు జాతీయ మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చాయి. తనపై కథనాలను ఆపాలని రకుల్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఆ సమయంలోనూ ఆమె ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదు. డ్రగ్ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుండి రకుల్ బయట కనిపించలేదు. నిన్నటికి నిన్న శుక్రవారం నాడు బయటకొచ్చారు.
రకుల్ ఫిట్నెస్ ఫ్రీక్ అనే సంగతి తెలిసిందే. రెగ్యులర్‌గా వర్కవుట్లు, యోగ, సైక్లింగ్ వంటివి చేస్తారు. శుక్రవారం బాడ్మింటన్ ఆడారు. ఆ ఫిట్నెస్ సెషన్ కంప్లీట్ అయిన తరవాత కెమెరా కంటికి చిక్కారు. డ్రగ్ వివాదం వచ్చినప్పుడు వైష్ణవ్ తేజ్ సరసన క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ చేశారు. ఇంకా ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి కాలేదని సమాచారం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



