ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కరాటే కల్యాణి ఔట్?
on Sep 19, 2020
బుల్లితెర ప్రేక్షకులతో పాటు దేశవిదేశాల్లోని తెలుగు నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్న బిగ్ బాస్ 4 సీజన్ ప్రారంభమై అప్పుడే రెండు వారాలు కావస్తుంది. మొదటివారం వీకెండ్ లో డైరెక్టర్ సూర్యకిరణ్ ఇంటిదారి పట్టారు. ఇక ఈ వారం ఇంటిదారి పట్టేది కరాటే కళ్యాణి అన్న విషయం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
ఇంటి సభ్యులందరి ఏకాభిప్రాయంతో నోయల్‌ను కొత్త కెప్టెన్‌గా ఎన్నుకున్నారు. దాంతో బిగ్ బాస్ సీజన్ 4లో రెండో కెప్టెన్ గా నోయల్ నిలిచాడు ఇంటి బాధ్యతలు తీసుకున్న కెప్టెన్ నోయల్ అప్పటివరకు ఉన్న కిచెన్ టీమ్ ను మార్చారు. ఆ టీమ్ నుంచి కళ్యాణిని తొలగించారు. దాంతో ఆమె కాస్త బాధపడింది. పనిలేకుండా ఉంటే అటూ ఇటూ మాటలు పెరుగుతాయి, తాను ఏదో ఒకటి అనడంతో గొడవ ఎందుకని తాను కిచెన్ లో ఉన్నానని కళ్యాణి వివరణ ఇచ్చింది. అయితే హౌస్ నుంచి బయటకు పంపేందుకే కళ్యాణిని కిచెన్ బాధ్యతల నుంచి తప్పించారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
నెక్ట్స్ ఎపిసోడ్ వీకెండ్ ఎపిసోడ్ కావడంతో హౌస్ నుంచి ఎలిమినేషన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఎలిమినేషన్ జాబితాలో ఉన్న తొమ్మిది మందిలో ఒకరు ఇంటిదారి పడతారు. "నేను ఉండలేను.. నన్ను పంపించండి" అంటూ కన్నీళ్లతో వేడుకున్న గంగవ్వను హౌస్ నుంచి బయటకు పంపిస్తారా? లేక తన ఓవర్ యాక్షన్ తో చికాకు తెప్పిస్తున్న కళ్యాణీని బ్యాగ్ సర్దేయ మంటారా తెలియాల్సిందే. అయితే కళ్యాణీ ఇంటిదారి పట్టాల్సిందే అని ప్రేక్షకులు ఇప్పటికే తమ ఓటింగ్ తో చెప్పారని వినికిడి. మరి నిజంగా బయటకు వెళ్లేది ఎవరూ అనేది మాత్రం నాగార్జున చెప్పాల్సిందే.
Also Read