Home

»

Latest News

బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లెప్పుడో చెప్పిన ర‌కుల్ ప్రీత్‌!

Nov 22, 2021 2:50PM

 

బాలీవుడ్ న‌టుడు, నిర్మాత జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉన్న‌ట్లు గ‌త నెల త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించి, అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది గ్లామ‌ర‌స్ యాక్ట్రెస్ ర‌కుల్‌ప్రీత్ సింగ్‌. సాధార‌ణంగా ఆమె త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను ప్రైవేట్‌గానే ఉంచుతుంది. లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మ్యారేజ్ ప్లాన్స్ గురించి అడిగిన‌ప్పుడు, పెళ్లెప్పుడ‌నే విష‌యం డిసైడ్ చేసుకున్న‌ప్పుడు దాన్ని అంద‌రితో షేర్ చేసుకుంటాన‌ని చెప్పింది. ప్ర‌స్తుతం త‌న ఫోకస్ అంతా కెరీర్‌పైనే ఉంద‌ని తెలిపింది.

తాను వినాల‌నుకున్న విష‌యాల‌నే వింటాన‌నీ, ఏ విష‌యాల‌కైనా ప్ర‌భావితం కాకూడ‌ద‌ని అనుకుంటాన‌నీ అంటోందామె. జాకీతో త‌న అనుబంధం గురించి సోష‌ల్ మీడియాలో మాట్లాడ్డానికి కార‌ణం, దాన్ని షేర్ చేసుకుంటే బాగుంటుంద‌ని అనిపించ‌డ‌మే అని చెప్పింది ర‌కుల్‌. మ‌రింత వివ‌రంగా మాట్లాడుతూ, "సెల‌బ్రిటీల జీవితాన్ని అంద‌రూ గుచ్చిగుచ్చి చూస్తుంటారు. ప‌బ్లిక్ ఫిగ‌ర్‌గా ఉండ‌టం వ‌ల్ల వ‌చ్చే ఇబ్బంది ఇది. ఏదేమైనా నా చుట్టూ వినిపించే చ‌ప్పుళ్ల‌కు నేను ఇబ్బందిప‌డ‌ను. కెమెరా ముందు నా ప‌ని నేను చేసుకుంటా. కెమెరా ఇవ‌త‌ల నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కు స్పేస్ ఇస్తా" అని ఆమె తెలిపింది.

వ‌ర్క్ విష‌యానికి వ‌స్తే, ఇటీవ‌లే క్రిష్ డైరెక్ష‌న్‌లో 'కొండ‌పొలం' మూవీలో వైష్ణ‌వ్‌తేజ్ జోడీగా క‌నిపించిన ర‌కుల్‌, ప్ర‌స్తుతం త‌న బాయ్‌ఫ్రెండ్ జాకీ నిర్మిస్తోన్న బాలీవుడ్ మూవీలో అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టిస్తోంది. అలాగే జంగ్లీ పిక్చ‌ర్స్ నిర్మిస్తోన్న 'డాక్ట‌ర్ జి' మూవీలో ఆయుష్మాన్ ఖురానా జోడీగా క‌నిపించ‌నుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com