వారం వారం పూర్ణ సందడి!
on Nov 22, 2021

`సీమ టపాకాయ్`, `అవును` సిరీస్ తో తెలుగునాట కథానాయికగా తనదైన ముద్ర వేసింది పూర్ణ. స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయినా.. టాలెంటెడ్ యాక్ట్రస్ గా మాత్రం పేరు తెచ్చుకుంది ఈ కేరళకుట్టి. ప్రస్తుతం ఒకవైపు కథానాయికగా నటిస్తూనే.. మరోవైపు కీలక పాత్రల్లోనూ అలరిస్తోంది పూర్ణ. అంతేకాదు.. వెబ్-సిరీస్ ల్లోనూ అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే.. తెలుగునాట వరుసగా నాలుగు వారాల పాటు సందడి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది పూర్ణ. నవంబర్ 12, నవంబర్ 19న ఆహా ఓటీటీ వేదికలో స్ట్రీమ్ అయిన `త్రీ రోజెస్` అనే వెబ్ - సిరీస్ లో ఇందుగా ఎంటర్టైన్ చేసిన పూర్ణ.. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానున్న విక్టరీ వెంకటేశ్ `దృశ్యం 2`లో అడ్వకేట్ గా కనిపించనుంది. అంతేకాదు.. డిసెంబర్ 2న విడుదల కానున్న నటసింహం నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్టైనర్ `అఖండ`లో ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. అదే విధంగా.. డిసెంబర్ 3న రిలీజ్ కానున్న `బ్యాక్ డోర్`తోనూ వినోదాలు పంచనుంది.
మొత్తమ్మీద.. వరుసగా నాలుగు వారాల పాటు ప్రధాన పాత్రల్లోనూ, కీలక పాత్రల్లోనూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది పూర్ణ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



