నేరుగా రంగంలోకి దిగిన రజనీకాంత్
on Apr 23, 2020

ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సీ)కి తమిళ తలైవా, సూపర్‌స్టార్ రజనీకాంత్ 50 లక్షల రూపాయలను డొనేషన్ కింద ఇచ్చారు. అక్కడితో తన బాధ్యత తీరిందని ఆయన అనుకోలేదు. తానే స్వయంగా రంగంలోకి దిగారు. లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న చోటా మోటా ఆర్టిస్టులు ఎవరనేది ఆరా తీశారు. తన దగ్గరకు లిస్టు తెప్పించుకున్నారు. తర్వాత 'నడిగర్ సంఘం'లో సుమారు 1000 మంది కళాకారులకు రజనీకాంత్ నేరుగా సహాయం చేశారు. భారీగా రైస్, కందిపప్పు, ఇతర నిత్యావసరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
జూనియర్ ఆర్టిస్టులకు త్వరలో రజనీకాంత్ సరుకులు అందజేస్తారని తెలిసింది. దీనికి ఓ కారణం ఉంది... ఫెఫ్సీకి డొనేట్ చేసిన 50 లక్షల రూపాయలతో నటీనటుల అవసరాలు కూడా తీరతాయని సూపర్‌స్టార్ భావించారు. అయితే... నడిగర్ సంఘంలో సీనియర్ సభ్యుడు ఒకరు ఫెఫ్సీలో నటీనటులు లేరని రజనీతో చెప్పారట. మరో ఆలోచన లేకుండా స్వచ్ఛందంగా నటీనటులకు సాయం చేయడానికి రజనీకాంత్ ముందుకొచ్చారని తెలిసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



