అమలా పాల్ పెళ్లికి టైముందట!
on Apr 23, 2020

తన పెళ్లి జరగడానికి మరికొంత సమయం ఉందని కథానాయిక అమలా పాల్ సెలవిచ్చారు. మొన్నీమధ్య ముంబైకి చెందిన గాయకుడు భవీందర్ సింగ్‌తో ఆమెకు వివాహమైందని వార్తలొచ్చాయి. అందుకు కారణం సింగ్ గారు. అతగాడు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అమలా పాల్‌తో దండలు మార్చుకుంటున్న ఫొటోలు, ముద్దులు పెట్టుకుంటున్న ఫొటోలు పోస్ట్ చేశాడు. కాసేపటికి డిలీట్ చేశాడు. అప్పటికే ఫొటోలు వైరల్ అయ్యాయి. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారని సన్నిహితులు కూడా చెప్పారు. అయితే... అప్పట్లో పెళ్లి గురించి అమలా పాల్ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. తీరిగ్గా నెల తర్వాత ఇప్పుడు తన పెళ్లిపై వచ్చిన వార్తల గురించి స్పందించారు.
"నా పెళ్లి జరగడానికి మరికొంత సమయం ఉంది. ప్రస్తుతం నేను సినిమాలతో బిజీగా ఉన్నాను. అవి పూర్తయ్యాక నా పెళ్లి గురించి ప్రకటన చేస్తా. నేను ప్రేమలో పడిన విషయం గురించి మాట్లాడాను కదా! సో... నేను నా పెళ్లి గురించీ మాట్లాడతాను. అప్పటికి వరకు రూమర్స్ ప్రచారం చేయవద్దు. సరైన సమయం వచ్చినప్పుడు నా పెళ్లి గురించి నేనే ప్రకటిస్తా" అని అమలా పాల్ తాజాగా తమిళంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదీ సంగతి! మరి, భవీందర్ సింగ్ పోస్ట్ చేసిన ఫొటోల సంగతి ఏంటనేది చెప్పలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



