బొలీవియాలో సందడి చేస్తున్న రజనీకాంత్..!
on Apr 24, 2016
.jpg)
సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో కు సీక్వెల్ గా వస్తోంది రోబో 2.0. శంకర్ అన్ని సినిమాల్లాగే, ఈ మూవీకి కూడా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కబాలీ తర్వాత రజనీ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గ్రాఫిక్స్ ప్రధానంగా ఉండే సీన్స్ కొన్నింటిని, ఢిల్లీ లోని స్టేడియంలో చిత్రీకరించారు. రజనీ, అక్షయ్ కుమార్ మధ్య ఉండే కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో పూర్తిచేశాడు శంకర్. శుక్రవారంతో ఈ షెడ్యూల్ పూర్తయింది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఈ సీన్స్ ను షూట్ చేశారు. తర్వాతి షెడ్యూల్ ను బొలీవియాలో ప్లాన్ చేశారు శంకర్ అండ్ కో. ఈ షెడ్యూల్ లో రజనీ, అమీ జాక్సన్ మధ్య సాంగ్స్ ను షూట్ చేస్తారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న రోబో 2.0 ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ ఫిల్మ్ గా తెరకెక్కడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



