మహేష్ కు బావను చూస్తే గర్వంగా ఉందట..!
on Apr 24, 2016
కృష్ణ అల్లుడిగా, మహేష్ బావగా సినిమాల్లో ఎంటరై తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు సుధీర్ బాబు. లేటెస్ట్ గా ఈ యువహీరోకు బాలీవుడ్ వర్షం రీమేక్ బాఘీలో విలన్ గా అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో సుధీర్ బాబు పెర్ఫామెన్స్ కు ప్రశంసల వర్షం కురుస్తోంది. కండలు తిరిగిన పెర్ఫెక్ట్ బాడీతో, మార్షల్ ఆర్ట్స్ ఎక్స్ పర్ట్ గా ఫెంటాస్టిక్ గా కుదిరిపోయాడు సుధీర్ బాబు. టాలీవుడ్ సినీ జనాల్లో ఎవరినోట విన్నా సుధీర్ బాబు మాటే. హీరో టైగర్ ష్రాఫ్ కంటే విలన్ సుధీర్ బాబే బాగున్నాడంటూ బాలీవుడ్ ప్రేక్షకులు సైతం కితాబిస్తుండటం విశేషం.
ఈ శుక్రవారం రిలీజవుతున్న బాఘీపై బాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు స్పెషల్ టీజర్ ను చూసి మహేష్ కూడా ఫ్లాట్ అయిపోయారు. సుధీర్ ను చూస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందని, ఒక బాలీవుడ్ సినిమాలో ఇలా మన తెలుగువాణ్ని చూడటం చాలా హ్యాపీగా ఉందంటున్నారు మహేష్. మూవీ యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. బాఘీ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ, సుధీర్ పెర్ఫామెన్స్ బాగుంటే బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు సంపాదిస్తాడనడంలో డౌట్ లేదు.