దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అలనాటి బస్ డ్రైవర్ ఫ్రెండ్‌కు అంకితమిచ్చిన రజనీకాంత్!
on Oct 25, 2021

భారతదేశపు అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు నుంచి అందుకున్నారు సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్. సినిమాల్లోకి రాకముందు కర్నాటకలో బస్ కండక్టర్‌గా పనిచేసిన ఆయన, తన అవార్డును అప్పటి తన పాత బస్ డ్రైవర్ ఫ్రెండ్‌కు అంకితమివ్వడం విశేషం. తనను సినిమాల్లోకి వెళ్లాల్సిందిగా ఆ స్నేహితుడే తనను ప్రోత్సహించాడని రజనీ చెప్పారు.
అతనితో పాటు తనను యాక్టర్‌గా 'అపూర్వ రాగంగళ్' మూవీతో పరిచయం చేసిన లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్, తన సోదరుడు సత్యనారాయణరావు, తనతో పనిచేసిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, థియేటర్ల యజమానులు, సాంకేతిక నిపుణులు, తన ఫ్యాన్స్‌కు కూడా ఫాల్కే అవార్డును ఆయన అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.
'అసురన్' సినిమాలో ప్రదర్శించిన నటనకు గాను ఉత్తమ నటునిగా అవార్డు పొందిన తన అల్లుడు ధనుష్‌తో కలిసి రజనీ ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. రజనీ భార్య లత, ధనుష్ భార్య ఐశ్వర్య కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ ఏడాది ఫాల్కే అవార్డుకు రజనీ పేరును ఆశా భోస్లే, శంకర్ మహదేవన్, మోహన్‌లాల్, బిస్వజిత్ చటర్జీ, సుభాష్ ఘాయ్‌లతో కూడిన జ్యూరీ ఎంపిక చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



