చలికాలంలో వేడిపుట్టిస్తున్న పూజ!
on Jan 19, 2022
కొవిడ్ థర్డ్ వేవ్‌తో దేశమంతా అతలాకుతలమవుతోంది. రోజుకు 2 లక్షలకు మించి కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. దీంతో సినిమా షూటింగ్‌లకు బ్రేకులు పడుతున్నాయి. పలు సినిమాల షూటింగ్స్ కేన్సిల్ కావడమో, వాయిదా పడటమో జరుగుతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే కూడా షూటింగ్‌కు వాయిదా పడటంతో ఖాళీగా ఉంటోంది. మామూలుగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. ఇప్పుడు పాత జ్ఞాపకాలను తిరిగితోడుకుంటోంది.
మంగళవారం రాత్రి ఆమె షేర్ చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆమధ్య మాల్దీవుల్లో షికారు చేసొచ్చిన ఆమె, ఆ టూర్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేసి, దానికి "Always bringing my own sunshine" అంటూ కాప్షన్ పెట్టింది. సముద్రంలో దిగేందుకు ఏర్పాటుచేసిన వుడెన్ స్టెయిర్‌కేస్ మీద నిల్చొని ఆ సముద్రపు గాలిని హాయిగా ఆస్వాదిస్తున్నట్లు పోజిచ్చింది పూజ. అందులోనూ ఆమె బికినీలో ఉంది. ఆ డ్రస్‌లో ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. చూసేవాళ్లకు చలికాలంలో వేడి పుట్టిస్తున్నట్లే ఉందా పోజు!
Also read: డేటింగ్ చేయకూడదనే రూల్‌తో సినిమాకి సంతకం చేసిన ఇస్మార్ట్ హీరోయిన్!
మూడు రోజుల క్రితం కూడా మాల్దీవుల వెకేషన్‌కు సంబంధించిన మరో ఫొటోను కూడా ఆమె పంచుకుంది. ఆ ఫొటోనే కాకపుట్టించిందనుకుంటే, ఇప్పుడు షేర్ చేసిన ఫొటో మరింతగా కవ్విస్తున్నట్లు ఉంది. దానికి నిదర్శనం.. అప్పుడే 1.3 మిలియన్ మందికి పైగా ఆ ఫొటోను లైక్ చేయడం!
Also read: ధనుష్-ఐశ్వర్య ఎందుకు విడిపోయారు?
వర్క్ విషయానికి వస్తే ఆమె నటించిన 'రాధే శ్యామ్', 'ఆచార్య', 'బీస్ట్' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హిందీ మూవీ 'సర్కస్' షూటింగ్ వాయిదా పడింది. త్వరలో ఆమె త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేశ్ సరసన నటించబోతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
