రజనీకాంత్ సినిమాలో హిందీ టీవీ హీరోయిన్
on Oct 19, 2019

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'దర్బార్'. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో రజనీకి జోడీగా నయనతార నటిస్తున్నారు. నయనతారతో పాటు 'దర్బార్'లో మరో హీరోయిన్ కూడా ఉన్నారు. తెలుగులో 'జెంటిల్‌మన్', 'నిన్ను కోరి' సినిమాల్లో నానికి జోడీగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ'లో ఒక హీరోయిన్‌గా నటించిన నివేదా థామస్. రజనీకి కుమార్తెగా నటిస్తున్నారామె. నయనతార, నివేదా థామస్ కాకుండా సినిమాలో మరో హీరోయిన్ ఉన్నారు. ఆమె పేరు షమత అంచన్. హిందీలో ఆశుతోష్ గోవారికర్ షో 'ఎవరెస్ట్', కామెడీ డ్రామా 'బిన్ కుచ్ కాహే'లో నటించింది. 'దర్బార్'లో రజనీతో పాటు ఉండే ఓ పాత్ర చేసింది. ముంబైలో 40 రోజుల పటు షూటింగ్ చేసింది. అయితే తన క్యారెక్టర్ ఏంటనేది షమత అంచన్ బయటకు చెప్పడం లేదు. చాలా సంవత్సరాల తరవాత రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్న చిత్రమిది. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



