బాలీవుడ్‌లో నాని సినిమా రీమేక్!!
on Jun 25, 2019

నాని హీరోగా జెర్సీ ఒక ఎమోషనల్ జర్నీగా క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ రాబట్టుకున్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా కొంత వెనకపడినా నాని పర్ఫారెన్స్ , డైరక్టర్ టేకింగ్, హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచాయి. నాని ది బెస్ట్ చిత్రాల్లో జెర్సీ కూడా ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఓ స్టార్ హీరోతో రీమేక్ చేయబోన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇటీవల జెర్సీ రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. ఈ రీమేక్ కోసం ఇటీవల అర్జున్ రెడ్డీ రీమేక్ కబీర్ సింగ్ లో నటించిన షాహిద్ కపూర్ `జెర్సీ` రీమేక్ నటించే అవకాశాలున్నాయట. ఇటీవల విడుదలైన కబీర్ సింగ్ బాలీవుడ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇక జెర్సీ రీమేక్ కు డైరక్టర్ గా ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరినే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



