పూజా హెగ్డే రూటులో రాజ్ తరుణ్!
on May 13, 2020
స్టార్ హీరోయిన్, బ్యూటిఫుల్ పూజా హెగ్డేను ఫాలో అవుతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. అయితే, అతడు ఫాలో అవుతున్నది రియల్ లైఫ్లో కాదు... రీల్ లైఫ్లో! ఒక క్యారెక్టర్ విషయంలో పూజా హెగ్డే రూటులోకి రాజ్ తరుణ్ వెళుతున్నాడు. ఇంతకీ, అసలు మేటర్ ఏంటంటే... మే 11న రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా అతడితో సినిమా చేస్తున్నట్టు కొత్త దర్శకుడు సంతోష్ మోహన్ వీరంకి అనౌన్స్ చేశాడు. ఆ సినిమాలో స్టాండప్ కమెడియన్ రోల్లో రాజ్ తరుణ్ కనిపించనున్నాడు. ఆల్రెడీ అఖిల్ అక్కినేని సరసన హీరోయిన్గా నటిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'లో పూజా హెగ్డే స్టాండప్ కమెడియన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త సినిమా కోసం రాజ్ తరుణ్ ఆ రూటులోకి వెళ్లనున్నాడు.
కరోనా కాటు వేయకపోతే రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమా మార్చి నెలాఖరులో విడుదల అయ్యేది. ఆల్రెడీ ఆ సినిమా రెడీ చేసిన రాజ్ తరుణ్... లాక్డౌన్ టైమ్లో కొత్త కథలు ఓకే చేస్తున్నాడు. స్నేహితుడు, తనతో 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' చేసిన శ్రీనివాస గవిరెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. సంతోష్ మోహన్ వీరంకి దర్శకత్వంలో ఇంకో సినిమా ఓకే చేశాడు.