
అక్కినేని... తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆ పేరుకి ఉన్న వైబ్రేషన్స్ ప్రతి సెకను కూడా అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకుల నోళ్ళల్లో నిత్యం తచ్చాడుతునే ఉంటుంది. నిజ నిర్దారణ కమిటీని వేసినా ఆ మాట వాస్తవమని చెప్తుంది. అక్కినేని బ్రాండ్ కి అంతటి పవర్.
అక్కినేని అమల ఇటీవల ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కోడళ్ళు శోభిత, జైనబ్ రావ్జీల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కినేని ఇంట ఒకప్పుడు కేవలం మగపిల్లలు మాత్రమే ఉండేవారని, కానీ ఇప్పుడు దేవుడి దయ వల్ల ఇద్దరు ముద్దుల కూతుర్లు దొరికారని ఆమె ఎంతో ఆప్యాయంగా పంచుకున్నారు. కుటుంబంలోకి కొత్తగా వచ్చిన ఈ ఇద్దరు కోడళ్ళు తమ కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చేశారు. నాగచైతన్యను వివాహం చేసుకున్న ప్రముఖ నటి శోభిత గురించి అమల ప్రత్యేకంగా ప్రస్తావించారు.
శోభిత ఎంతో అన్యోన్యమైన వ్యక్తి అని, తన కెరీర్లో అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ ఇంట్లో అందరితో చాలా సాదాసీదాగా, ఆప్యాయంగా ఉంటుందని కొనియాడారు. శోభితతో అనుబంధం పెంచుకోవడం చాలా సులభమని, ఆమె స్వచ్ఛమైన మనసు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. అలాగే అఖిల్ అక్కినేని భార్య జైనబ్ రావ్జీతో తనకున్న సాన్నిహిత్యం గురించి చెబుతూ, జైనబ్ తనకు కూతురికంటే ఎక్కువగా మారిపోయిందని తెలిపారు.
.webp)
అఖిల్ వివాహానికి ముందే జైనబ్ పరిచయం కావడంతో ఆమెతో ఆ బంధం మరింత బలంగా ఏర్పడిందని అమల వివరించారు.జైనబ్ రాకతో తమ ఇంట్లో పండుగలు, వేడుకల శైలే పూర్తిగా మారిపోయిందని అమల వెల్లడించారు. గతంలో అక్కినేని ఇంట పండుగలు చాలా చిన్నవిగా, నిరాడంబరంగా జరిగేవని, కానీ ఇప్పుడు జైనబ్ అందరినీ ఏకం చేసి ప్రతి పండుగను ఎంతో వైభవంగా, ఘనంగా జరుపుకునేలా చూస్తుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: కొత్త లోక చాప్టర్ 1 రికార్డు గల్లంతు?: దెబ్బకొట్టింది మన తెలుగు హీరోయిన్ నే!
అంతేకాకుండా, నాగార్జునను, తనను స్వంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా జైనబ్ చూసుకుంటుందని, ఇంట్లోని 89 ఏళ్ల వృద్ధురాలైన తన తల్లిని కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ అందరి హృదయాలని గెలుచుకుందని అమల భావోద్వేగంతో పంచుకున్నారు.
విభిన్న సంస్కృతులు, నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ, జైనబ్ తమ హిందూ కుటుంబంలో ఇమిడిపోవడానికి చూపిన చొరవ అద్భుతమని ఆమె కొనియాడారు.కుటుంబ బంధాలు, వివాహ వ్యవస్థపై మాట్లాడుతూ.. ఏ బంధమైనా నిలబడాలంటే సమయం, పరస్పర అవగాహన చాలా ముఖ్యమని అమల స్పష్టం చేశారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదని, కానీ మనశ్శాంతి లేని చోట బంధాలను బలవంతంగా లాగడం కంటే విడిపోవడమే మేలని ఆమె అభిప్రాయపడ్డారు.

ఏదేమైనప్పటికీ, శోభిత మరియు జైనబ్ రూపంలో తమ కుటుంబానికి అంతులేని సంతోషం, అద్భుతమైన శక్తి వచ్చాయని, ఈ ఇద్దరు కోడళ్ళు తమ ఇంట వెలుగులు నింపారని అమల ముగించారు. ఇప్పుడు ఈ మాటలు అక్కినేని అభిమానుల్లో జోష్ తీసుకొచ్చాయి. హీరోయిన్ గా అమల సాధించిన విజయాలు తెలిసిందే.
మీకు నచ్చవచ్చు:ఈ వారం రిలీజయ్యే చిత్రాల్లో విజేత ఈ సినిమానే!
మీకు నచ్చవచ్చు:సినిమాకి హిట్ సూత్రం ఇదేనంట!
[Amala Akkineni, Sobhita, Zainab, Nagarjuna, Naga Chaitanya, Akhil]





