అందం గురించి క్లాస్ పీకుతోంది..!
on May 30, 2016

నటనతో పాటు, తన అందంతోనూ అభిమానులను సంపాదించుకుంది రాధికా ఆప్టే. తెలుగులో రక్త చరిత్ర, లెజండ్ లాంటి సినిమాలతో బాగా పేరు తెచ్చుకున్న రాధిక ఆ తర్వాత బాలీవుడ్ లో మాంఝీ, ఫోబియా లాంటి వైవిధ్యమైన సినిమాలతో నటిగా నిరూపించుకుంది. తాజాగా, ఈ భామ అందం గురించి లెక్చర్లు దంచుతోంది. అందం అంటే కంటికి కనిపించేది కాదని, అది వేసుకునే బట్టలతోనూ, స్కిన్ కలర్ తోనూ రాదని, ఎదుటివాళ్లను అర్ధం చేసుకునే మనసున్నప్పుడే నిజమైన అందం ఉన్నట్టు లెక్క అంటూ కొత్త పాఠాలు వల్లిస్తోంది. నాకు మేకప్ తో ఉండటమంటే చిరాకు. అసలు దాన్ని అందం అని అనకూడదు. అందం అనేది వ్యక్తిత్వం, బిహేవియర్ వల్ల వస్తుంది. నా వరకూ నేను ఇంటిదగ్గర కేవలం షార్ట్స్ అండ్ పైజామా తోనే ఉంటాను. నా ఫ్రెండ్స్ అంతా చాలా అందమైనవాళ్లు అంటూ చెప్పుకొస్తోందీ భామ. మరి అందం గురించి ఇంత తెలిసినదానివి, స్కిన్ షో తో కవర్ పేజీల స్టిల్స్ ఎందుకు చేస్తున్నావు పాపా అంటూ కిసుక్కుమంటున్నారు సినీ జనాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



