రహస్యంగా ప్రియుడిని కలిసిన దీపికా పదుకొనే..!
on May 30, 2016

ప్రేమలో మునిగి తేలే జంటను ఒకరిని విడిచి ఒకర్ని ఉండమంటే కష్టమే. అందునా, సెలబ్రిటీలకు ఇది ఇంకా కష్టమైన పని. ప్రస్తుతం బాలీవుడ్ బెస్ట్ లవ్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనేలు ఇదే ఫేజ్ లో ఉన్నారు. దీపిక xxx అనే హాలీవుడ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం గత కొన్ని నెలలుగా ఆమె ఫారిన్ లోనే ఉంది. మరో వైపు బేఫికర్ షూటింగ్ లో రణ్ వీర్ సింగ్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా దీపిక సినిమా షూట్ పూర్తవడంతో వెంటనే ప్రియుడి దగ్గర వాలిపోయింది దీపిక. ప్యారిస్ లో బేఫికర్ షూటింగ్ తో బిజీగా ఉన్న రణ్ వీర్ ను చూడటానికి టోరంటో నుంచి డైరెక్ట్ గా వచ్చేసింది. చాలా రహస్యంగా రణ్ వీర్ ను చూసి వెళ్లిపోదామనుకున్నా అక్కడి అభిమానులు గుర్తు పట్టేశారు. ఫోటోలు తీయబోయిన వాళ్లను మూవీ టీం వారించడంతో దీపిక ఫోటోలు బయటికి రాలేదు. చుట్టూ జనాలు వచ్చేయడంతో, రణ్ వీర్ తో కాసేపు పర్సనల్ గా మాట్లాడే అవకాశం కూడా ఆమెకు దొరకలేదట. సెలబ్రిటీలకు ఎన్ని కష్టాలో పాపం..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



