`రాధే శ్యామ్`.. సెకండ్ సింగిల్ కి వేళాయే!
on Nov 27, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాన్నాళ్ళ తరువాత చేసిన రొమాంటిక్ డ్రామా `రాధే శ్యామ్`. `బుట్టబొమ్మ` పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాని `జిల్` ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేశారు. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ పాన్ - ఇండియా మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న పలు భాషల్లో ఎంటర్టైన్ చేయనుంది.
ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ``ఈ రాతలే`` అంటూ `రాధే శ్యామ్` నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసిన యూనిట్.. త్వరలో సెకండ్ సింగిల్ ని విడుదల చేయబోతోందట. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డిసెంబర్ తొలి వారంలో `రాధే శ్యామ్` తాలూకు రెండో లిరికల్ వీడియోని రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది.
కాగా కృష్ణంరాజు, జయరామ్, భాగ్యశ్రీ, జగపతి బాబు, సచిన్ ఖేద్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, సత్యన్, ఫ్లోరా జకోబ్, సాషా చెట్రి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్న `రాధే శ్యామ్`కి మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తెలుగు వెర్షన్ కి జస్టిన్ ప్రభాకరన్, హిందీ వెర్షన్ కి మిథున్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
