జూనియర్ లెజెండ్ గా పూరి కొడుకు
on Nov 16, 2013

నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ యంగ్ బాలకృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఆకాష్ షూటింగ్ లో పాల్గొననున్నాడని దర్శకుడు తెలిపారు.ఈ చిత్రంలో బాలయ్య సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలన్ పాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడు. ఈ చిత్రానికి "లెజెండ్" అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలిసింది. గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



