బన్నీ వల్లే 'లైగర్' మొదలైంది!
on Aug 24, 2022

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'. భారీ అంచనాల నడుమ రేపు(ఆగస్టు 25న) ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ నత్తితో ఇబ్బందిపడే యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే పూరికి 'లైగర్' కథ రాయాలన్న ఆలోచన రావడానికి అల్లు అర్జున్ కారణమట.
'లైగర్' ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా పూరిని డైరెక్టర్ సుకుమార్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ లైగర్ కథ పుట్టడానికి బన్నీ కారణమని చెప్పాడు. "పదేళ్ళ క్రితం 'ఇద్దరమ్మాయిలతో' షూటింగ్ సమయంలో బన్నీ ఒక హాలీవుడ్ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ.. ఆయన ప్రతి సినిమాలో హీరోకి ఏదో ఒక లోపం చూపిస్తాడు. అలాంటి పాత్ర మీరు కూడా రాయొచ్చు కదా అన్నాడు. అప్పుడు నత్తితో ఇబ్బందిపడే హీరో పాత్ర రాయాలన్న ఆలోచన వచ్చింది. బన్నీకి చెప్తే సూపర్ అన్నాడు. బన్నీ వల్లే ఈ ఐడియా వచ్చింది. అలాగే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. నత్తిని, మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ని కలిపి లైగర్ కథ రాశాను" అని పూరి చెప్పుకొచ్చాడు.
అలాగే ఇక నుంచి ఫాస్ట్ ఫాస్ట్ గా సినిమాలు చేయనని.. ఓపికగా స్క్రిప్ట్ రాసి, టైం తీసుకొని సినిమాలు చేస్తానని పూరి అన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



