'సలార్'లో యష్.. క్లారిటీ వచ్చేసింది!
on Dec 15, 2023

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'సలార్'. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు భాగాలుగా రానుండగా, మొదటి భాగం సీజ్ ఫైర్ డిసెంబర్ 22న విడుదల కానుంది.
అయితే సలార్ అనేది ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న సినిమా అని, ఈ కథ 'కేజీఎఫ్'తో ముడిపడి ఉంటుందని, సినిమాలో హీరో యష్ గెస్ట్ రోల్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ 'సలార్'కి, 'కేజీఎఫ్'కి సంబంధం లేదని ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ 'సలార్'లో యష్ మెరవనున్నాడనే వార్తలకు బ్రేక్ పడటంలేదు. ఈ క్రమంలో దీనిపై మరోసారి క్లారిటీ వచ్చింది.
'సలార్' సినిమాలో యష్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు అనే వార్తను నిర్మాత విజయ కిరాగందుర్ ఖండించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సలార్ లో యష్ క్యామియో రోల్ ఉంటుందనే వార్త పూర్తిగా అవాస్తవమని చెప్పారు.
పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



