బోల్డ్ సీన్‌లో రెచ్చిపోయిన బ్రహ్మముడి అపర్ణ కూతురు!
on Dec 15, 2023
స్మాల్ స్క్రీన్ మీద కార్తీక దీపం సీరియల్ ఐపోయాక ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ బ్రహ్మముడి సీరియల్ రేటింగ్ లో దూసుకుపోతోంది. ఇక ఈ సీరియల్ లో హీరో రాజ్ కి తల్లిగా అపర్ణ నటిస్తోంది. ఐతే అపర్ణ అసలు పేరు శ్రీప్రియ శ్రీకర్. చిన్నప్పుడు ప్రసారమైన మొగలి రేకులు సీరియల్ లో హీరోయిన్ కి తల్లి రోల్ లో నటించింది. అప్పటినుంచి ఆమె ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తోంది. శ్రీప్రియకు ఒక కూతురు ఉంది. ఆమె పేరే చరిష్మా శ్రీకర్.. ఈమె కూడా మూవీస్ లో నటిస్తోంది. రీసెంట్ గా ఆమె యాక్ట్ చేసిన మూవీ "ప్రేమలో" టీజర్ రిలీజ్ అయింది. లవ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రాబోతోంది. అలాగే ఈ మూవీ టీజర్‌లో ఓ బోల్డ్ సీన్‌లో కూడా చరిష్మా ఎలాంటి మొహమాటం లేకుండా చాలా ఈజీగా నటించేసింది.

అంతకుముందు "నీతోనే హాయ్ హాయ్, ఆర్ యూ మ్యారీడ్ " లాంటి మూవీస్ లో నటించింది చరిష్మా. అలానే రీసెంట్‌గా జగపతి బాబు, మమతా మోహన్ దాస్ నటించిన 'రుద్రంగి' మూవీలో కూడా ఒక కీ రోల్ లో నటించింది. శ్రీప్రియ సీరియల్స్‌లో సత్తా చాటుతుంటే కూతురు సిల్వర్ స్క్రీన్ మీద దుమ్ములేపుతోంది. సోషల్ మీడియాలో కూడా చరిష్మా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. ఇక శ్రీప్రియ ప్రస్తుతం బ్రహ్మముడితో పాటు వైదేహి పరిణయంలో కూడా యాక్ట్ చేస్తోంది. బుల్లితెర మీద మొగలి రేఖలు సీరియల్ టైం నుంచి కూడా ఆమె తల్లి పాత్రల్లోనే చేస్తూ వస్తోంది. మొగలిరేకులు సీరియల్ లో దేవిలో చేసిన లిఖిత కామినికి తల్లి పాత్రలో రజనిగా శ్రీప్రియ నటించింది. ఈమె బుల్లితెర మీదకు వచ్చి 15 ఏళ్లు పైగానే అయ్యింది. ఎన్నో సీరియల్స్ లో హీరో హీరోయిన్ లీడ్ రోల్స్ కి తల్లి క్యారెక్టర్ లో నటించింది. ఇప్పుడు బ్రహ్మముడిలో కూడా హీరో రాజ్ కి తల్లిగా నటిస్తోంది. శ్రీప్రియకి ఇద్దరూ ఆడపిల్లలే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



