మహేష్ గుంటూరు కారాన్ని ఏం చెయ్యాలో తెలుసు..వైరల్ అవుతున్న నిర్మాత కొడుకు పోస్ట్
on Dec 15, 2023

ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ని ఆపడం ఎవరి వల్ల కావడంలేదు. ఎందుకంటే సంవత్సరం తర్వాత తమ అభిమాన హీరో నుంచి గుంటూరు కారం మూవీ వస్తుందనే ఆనందంతో వాళ్ళు ఉన్నారు. ఆ సినిమాకి సంబంధించి అన్ని కూడా సూపర్ గా ఉండాలని ఫ్యాన్స్ చాలా బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో గుంటూరు కారం నుంచి విడుదలైన రెండో సాంగ్ తాము ఆశించినంత రీతిలో లేదని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లందరికీ ఒక నిర్మాత కొడుకు తన ట్విటర్ వేదికగా ఇచ్చిన రిప్లై ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.
గుంటూరు కారం నుంచి మొన్న ఓ మై బేబీ అనే సాంగ్ విడుదల అయ్యింది. ఈ సాంగ్ అసలు బాగోలేదంటూ థమన్ ని ఉద్దేశించి మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ ఏవీ కూడా తమని లెక్క చేయవని అనే రీతిలో మేమేం చేస్తున్నామో మాకు తెలుసు జనవరి 12 న కలుసుకుందామని నాగవంశీ చెప్పాడు. పైగా యానిమల్ మూవీ ఎండింగ్ లో ముసలి గెటప్ తో ఉండే రణబీర్ కపూర్ వీడియోని కూడా నాగ వంశీ పెట్టాడు. నాగవంశీ ఎవరో కాదు గుంటూరు కారం మూవీ నిర్మాత రాధాకృష్ణ కి కొడుకు వరుస అవుతాడు. నాగవంశీ కూడా సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై భారీ సినిమాలని నిర్మిస్తు ఉంటాడు.

సంక్రాంతికి రాబోతున్న గుంటూరు కారం మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పైగా సంవత్సరం నుంచి మహేష్ సినిమా ఏది కూడా రాకపోయే సరికి ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నారు. మరి నిర్మాత నాగ వంశీ పోస్ట్ చేసిన వీడియోకి మహేష్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి .
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



