నా కళ్ళు క్యూట్... స్మైల్ సెక్సీ
on Mar 17, 2020

ఒకప్పుడు ప్రియమణి వెండితెరపై ఎక్కువగా కనిపించేవారు. కథానాయికగా ఏడాదికి రెండు మూడు తెలుగు సినిమాలు చేసేవారు. ఇప్పుడు బుల్లితెరపై ఎక్కువ కనిపిస్తున్నారు. ప్రతి బుధవారం ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. బహుశా... అందువల్లనే ఏమో సోషల్ మీడియాలో ఆమెను ఎక్కువగా 'ఢీ'కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియమణి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో సుధీర్, రష్మీ గురించి చెప్పమంటే... "వాళ్ళు లేకపోతే 'ఢీ' లేదు. సుధీర్ మల్టీటాలెంటెడ్. రష్మీ మంచి వ్యక్తి" అని చెప్పారు. యాంకర్ ప్రదీప్ మంచివాడని, నిరాడంబరంగా ఉంటాడని ఆమె అన్నారు. ఇద్దరు ముగ్గురు ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తే... కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటో చెప్పారు.
ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నట్టు ప్రియమణి చెప్పారు. అందులో వెంకటేష్ సరసన నతిష్టున్న 'నారప్ప' ఒకటి అని తెలిసిందే. నటనలో తనకు కమల్ హాసన్, శ్రీదేవి స్ఫూర్తి అని చెప్పిన ప్రియమణి... "మీ బాడీలో క్యూట్, సెక్సీ పార్ట్శ్ ఏంటి?" అని అడిగితే "నా కళ్ళు క్యూట్... స్మైల్ సెక్సీ" అని ఆన్సర్ ఇచ్చారు. ఒక అభిమాని అయితే "మీతో నేను ప్రేమలో ఉన్నాను. కానీ, మీరు నాకంటే వయసులో పెద్దవారు" అని అన్నాడు. అందుకు బదులుగా "నా పెళ్లి అయిందనే సంగతి మర్చిపోకు" అని ప్రియమణి సమాధానం ఇచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



