ఫ్లాప్ దర్శకుడుకి దుల్కర్ ఛాన్స్
on Mar 17, 2020

'కనులు కనులను దోచాయంటే' సినిమా విడుదల సమయంలో హైదరాబాద్ వచ్చినప్పుడు త్వరలో తెలుగు సినిమా చేస్తున్నట్లు దుల్కర్ సల్మాన్ చెప్పాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని... ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అది హను రాఘవపూడి సినిమా అని సమాచారం. 'అందాల రాక్షసి' దర్శకుడితో సినిమా చేయడానికి దుల్కర్ సల్మాన్ రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.
తొలి సినిమా 'అందాల రాక్షసి'తో హను రాఘవపూడి మంచి పేరు తెచ్చుకున్నారు. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'తో హిట్ కొట్టారు. కానీ, ఆ తర్వాత అతడు దర్శకత్వం వహించిన రెండు సినిమాలు 'లై', 'పడిపడి లేచే మనసు' ప్లాప్స్ అయ్యాయి. అతడికి దుల్కర్ సల్మాన్ ఛాన్స్ ఇస్తున్నాడు. నిజానికి, లవ్ సీన్స్ రాయడంతో హను రాఘవపూడి ఒక స్పెషల్ స్టైల్ ఉంది. కామెడీ కూడా బాగా రాస్తాడు. కరెక్ట్ కథ పడితే బాగా డీల్ చేయగలడు. ప్రజెంట్ హిట్ కొట్టాలనే కసిలో ఉన్నాడు కాబట్టి మంచి కథ రాసుకుని ఉండి ఉంటాడు. 'ఓకే బంగారం' సినిమాతో దుల్కర్ తెలుగులో తొలి విజయం అందుకొన్నారు. 'మహానటి'తో సాలిడ్ హిట్ కొట్టాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



