ప్రిన్స్ తో సుకుమార్ చిత్రం మార్చ్ లో
on Dec 5, 2011
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, విభిన్న యువ దర్శకుడు సుకుమార్ ఒక వెరైటీ సినిమా తీయబోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరో అంటే ఆ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దానికి కారనం ఇటీవల శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన "దూకుడు" చిత్రం సూపర్ హిట్టవటమే కారణం.
అదీ గాక ప్రస్తుతం "పోకిరి" వంటి ఆల్ టైమ్ హిట్ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "బిజినెస్ మ్యాన్" చిత్రం విడుదలకు సిద్ధమవటం కూడా మరో కారణం కావచ్చు. సుకుమార్ కూడా "100% లవ్" సినిమాతో హిట్ కొట్టి ఉండటం వీళ్ళిదరి కాంబినేషన్ అనగానే ఆ సినిమాపై అంచనాలు పెరుగుతాయి. ఈ చిత్రం మార్చ్ లో ప్రారంభం కానుందని సమాచారం.