నా సినిమాలో ఆ రెండు ఉండవు అంటున్న వర్మ
on Nov 29, 2023
తన మొదటి సినిమా ఆ నుంచి డిఫెరెంట్ జోనర్ ఉన్న చిత్రాలని తెరకెక్కించే దర్శకుడు ప్రశాంత్ వర్మ. అద్భుతం ,దట్ ఈజ్ మహాలక్ష్మి , కల్కి ,జాంబిరెడ్డి లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఇప్పుడు ప్రశాంత్ తాజాగా హను మాన్ అనే ఒక డిఫెరెంట్ టైప్ ఆఫ్ జోనర్ తో కూడిన సబ్జట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక సంచలన వార్తని ప్రశాంత్ వర్మ బయటపెట్టాడు.
హను మాన్ సినిమాలో ధూమపానానికి సంబంధించి కానీ మద్యంకి సంబంధించి కానీ ఒక్క సీన్ కూడా ఉండటం లేదని ప్రశాంత్ వర్మ చెప్పాడు. అలాగే మా హను మాన్ సినిమా కుటుంబం మొత్తం చూసి ఎంజాయ్ చేసే ఒక క్లీన్ చిత్రమని కూడా వర్మ తెలిపాడు. ఈ హను మాన్ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తుండగా ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాణం జరుపుంటుంది.
గతంలో తేజ అండ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన జాంబి రెడ్డి ఘన విజయాన్ని సాధించడంతో ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో వస్తున్న హను మాన్ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుంది. వెన్నెల కిషోర్, దీపక్ శెట్టి , సత్య ,గెటప్ శ్రీను తదితరులు మిగతా పాత్రలో నటిస్తున్నారు. తెలుగులో వస్తున్న మొట్టమొదటి సూపర్ హీరో చిత్రమైన ఈ హను మాన్ సంక్రాంతికి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
