విజయ్ తో లవ్ టుడే భామ
on Nov 29, 2023
ఇళయ దళపతి తాజాగా లియోతో భారతదేశ వ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 500 కోట్ల రూపాయిల దాకా లియో వసూలు చేసింది. దీంతో విజయ్ స్టామినా అంటే ఏంటో మరోసారి అందరికి అర్ధం అయ్యింది. అలాగే విజయ్ సినిమా చూడాలని ప్రేక్షకులు ఎంతగా కోరుకుంటారో విజయ్ సినిమాలో నటించాలని కూడా ఆర్టిస్ట్ లు అంతే ఇదిగా కోరుకుంటారు. ఇప్పుడు విజయ్ వెంకట్ ప్రభు కలయికలో వస్తున్న కొత్త మూవీలో నటించే అవకాశాన్ని ఒక హీరోయిన్ అందుకొని టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
2022 లో వచ్చిన లవ్ టుడే మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తమిళ భాషతో పాటు తెలుగు ప్రేక్షకులని కూడా ఈ సినిమా ఎంతగానో అలరించింది. ఇందులో హీరోయిన్ గా చేసిన ఇవానా ఇప్పుడు విజయ్ అప్ కమింగ్ మూవీలో నటించే అవకాశాన్ని పొందింది. విజయ్ కి సోదరికి ఆమె ఈ మూవీలో నటించబోతుంది. విజయ్ సినిమాలో ఇవానా నటించబోతుందనే వార్తలు విన్న కోలీవుడ్ కి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాతో ఇవానా దశ తిరగడం ఖాయమని అంటున్నారు.
విజయ్ తో సినిమా అంటే ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది. అప్పుడు ఇవానా గురించి భారతీయ ప్రేక్షకుల మొత్తానికి తెలుస్తుంది. దాంతో ఆమె సినీ కెరీర్ కి మంచి ఎస్టాబ్లిష్ దొరుతుంది. పైగా లవ్ టుడే లో ఇవానా ప్రదర్శించిన పెర్ఫార్మెన్సు కి ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడు కాబట్టి విజయ్ సినిమా ద్వారా ఇవానా కి మంచి అవకాశం దక్కినట్లే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
