ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఇదే.. లిస్టులో అనసూయ, సుడిగాలి సుధీర్
on Jun 24, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ ప్రకటించారు. దీంతో ఈసారి మా పోరు మరింత రసవత్తరంగా మారనుంది. అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ ఇప్పటికే స్పీడ్ పెంచారు. తాజాగా ఆయన తన ప్యానల్ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27మందితో కూడిన జాబితాను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. "త్వరలో జరగబోయే ఎన్నికలను పురస్కరించుకుని 'మా' శ్రేయస్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టే దిశగా.. మా ప్రతిష్ట కోసం.. మన నటీ నటుల బాగోగుల కోసం.. 'మా' టీంతో రాబోతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా" అని పేర్కొన్నారు. పదవుల కోసం పోటీ చేయడం లేదు.. కేవలం పనులు చేసేందుకు మాత్రమే ఈ ఎన్నికల బరిలో దిగుతున్నానని ప్రకాష్ రాజ్ తెలిపారు.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ జాబితా:
1.ప్రకాష్ రాజ్, 2.జయసుధ, 3.శ్రీకాంత్, 4.బెనర్జీ, 5.సాయికుమార్, 6.తనీష్, 7.ప్రగతి, 8. అనసూయ, 9.సన, 10.అనిత చౌదరి, 11.సుధ, 12.అజయ్, 13.నాగినీడు, 14.బ్రహ్మాజీ, 15.రవిప్రకాష్, 16.సమీర్, 17.ఉత్తేజ్, 18.బండ్ల గణేష్, 19.ఏడిద శ్రీరామ్, 20.శివారెడ్డి, 21.భూపాల్, 22.టార్జాన్, 23.సురేష్ కొండేటి, 24.ఖయ్యుం, 25.సుడిగాలి సుధీర్, 26.గోవిందరావు, 27.శ్రీధర్‌రావు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
