హార్స్రేసులో గెలిచిన డబ్బును లక్ష్మి ఏం చేశారో తెలుసా?
on Jun 24, 2021
సీనియర్ నటి లక్ష్మి ఓసారి రేసులకు వెళ్లారు. అలాగని రేసులకు వెళ్లే అలవాటేమీ ఆమెకు లేదు. ఒకే ఒక్కసారి వెళ్లారు. అదైనా.. 'అంతా లక్.. లక్ అంటుంటారు కదా.. నా లక్ ఎలావుందో చూసుకుందాం' అని వెళ్లారు. ఆ రోజు లక్ష్మి లక్ బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు కన్నడ సినిమా షూటింగ్ నిమిత్తం ఆమె బెంగళూరులో ఉన్నారు. అక్కడ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి రేసులకు వెళ్లారు.
ఒక గుర్రంమీద ఐదు రూపాయలు పందెం కట్టారు లక్ష్మి. ఆ గుర్రం మిగతా అన్ని గుర్రాలనూ దాటి ముందుకొచ్చేస్తుంటే, ఆమె ఎంతో ఎగ్జయిటింగ్‌కు గురయ్యారు. ఆమె పెట్టిన ఐదు రూపాయలకు ఐదు వందలు వచ్చాయి. గెలిచినప్పుడు ఎంత ఆనందం అనుభవించారో, ఆ ఐదు వందలు చేతికి వచ్చాక అంత ఆందోళన ఆమెలో ప్రారంభమైంది.
తనలోనే ఆమె, 'ఇది న్యాయంగా సంపాదించిన డబ్బు కాదు కదా' అనుకున్నారు. చివరికో నిర్ణయానికి వచ్చారు, ఆ డబ్బును పేదవాళ్లకు పంచిపెట్టాలని. నిజంగా అదే చేశారు కూడా. ఆ తర్వాత ఆమె మళ్లీ ఎప్పుడూ రేసులకు వెళ్లలేదు. ఇది ఇప్పటి మాట కాదు, చాలా ఏళ్ల క్రితం నాటిది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ పత్రికకు వెల్లడించారు.
ఈ మధ్య నందినీరెడ్డి డైరెక్ట్ చేసిన 'ఓ బేబీ' మూవీలో బేబిగా లక్ష్మి ప్రదర్శించిన నటన అందరినీ అమితంగా ఆకట్టుకుంది.
Also Read