మరోసారి యూత్‌ని టార్గెట్ చేసిన ప్రదీప్.. ‘డ్యూడ్’లో అన్నీ ఉన్నాయి!
on Oct 9, 2025
ఇటీవలి కాలంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో పాటు యూత్‌ని టార్గెట్ చేస్తూ రూపొందిన సినిమాలు కూడా భారీ విజయాలు అందుకుంటున్నాయి. దర్శకనిర్మాతలు కూడా ప్రజెంట్ జనరేషన్ యూత్‌కి కనెక్ట్ అయ్యే సబ్జెక్టులతోనే ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందిస్తున్నారు. ఆమధ్య వచ్చిన ‘లవ్‌టుడే’ సినిమాని కూడా అదే పంథాలో చేశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు అందులో హీరోగా నటించిన ప్రదీప్ రంగనాథన్ అంటే ఎవరికీ తెలీదు. ఆ సినిమా సూపర్‌హిట్ అవ్వడంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా మరో యూత్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రదీప్. ‘డ్యూడ్’ పేరుతో రూపొందిన యూత్‌ఫుల్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెలుగు నిర్మాతలు నిర్మించిన తమిళ సినిమా ఇది. ఈ సినిమాకి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 17న దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. తెలుగులో కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న కుర్రాడి జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అనే అంశంపై సినిమా కథ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటూనే సినిమాలో లవ్ ఫీల్ కూడా ఉంది. అలాగే కొన్ని సెంటిమెంట్ సీన్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. రొమాంటిక్ యాక్షన్ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని ఎమోషన్స్‌లో హీరో ప్రదీప్ రంగనాథన్ పెర్‌ఫార్మెన్స్ బాగుంది. అతనికి పెయిర్‌గా నటించిన మమిత బైజు కూడా క్యూట్‌గా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



