ప్రభాస్ మిస్సయ్యాడు.. లారెన్స్ బుక్కయ్యాడు.. ఇప్పటికీ 'రెబల్'ని వదలట్లేదుగా!?
on Sep 21, 2023
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' సినిమా.. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే సెప్టెంబర్ 28న థియేటర్స్ లో పడేది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల సదరు పాన్ ఇండియా మూవీ వాయిదా పడింది. కొత్త విడుదల తేదిని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. మరోవైపు.. 'సలార్' సెప్టెంబర్ 28 నుండి పోస్ట్ పోన్ అవడంతో.. అదే తేదికి రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న 'స్కంద' పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ కానుంది. ఇక అదే సెప్టెంబర్ 28కి 'చంద్రముఖి 2' కూడా నేషనల్ వైడ్ ఎంటర్టైన్ చేయనుంది. పి. వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో లారెన్స్ రాఘవ, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. 'సలార్' సెప్టెంబర్ 28న రిలీజ్ కాకపోవడం.. ప్రభాస్ అభిమానులకు ఒకరకంగా ఆనందాన్నిచ్చే విషయమే. ఎందుకంటే.. గతంలో అదే తేదికి ప్రభాస్ డిజాస్టర్ మూవీ 'రెబల్' విడుదలైంది. భారీ అంచనాల నడుమ 2012 సెప్టెంబర్ 28న జనం ముందు నిలిచిన సదరు యాక్షన్ ఎంటర్టైనర్.. ఓపెనింగ్స్ పరంగా ఓకే అనిపించినా ఫైనల్ గా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది. 'కాంచన' వంటి సంచలన చిత్రం తరువాత దర్శకుడిగా లారెన్స్ రాఘవ నుంచి వచ్చిన మూవీ కావడం కూడా అప్పట్లో ఈ క్రేజ్ కి ఓ కారణమనే చెప్పాలి. 'రెబల్'కి లారెన్స్ డైరెక్టర్ మాత్రమే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా కావడం విశేషం.
ఏదేమైనా.. 'రెబల్' తేదిని ఆ చిత్ర హీరో ప్రభాస్ మిస్ చేసుకున్నా.. దర్శకుడు లారెన్స్ మాత్రం బుక్కయ్యాడన్నమాట. దర్శకుడిగా కాకుండా హీరోగా లారెన్స్ చేసిన 'చంద్రముఖి 2' ఇప్పుడు 'రెబల్' తేది అయిన సెప్టెంబర్ 28నే రాబోతోంది. మొత్తానికి 'రెబల్' తేదిని అయితే ఆ టీమ్ మిస్సవట్లేదన్నమాట. మరి.. 'రెబల్'లాగే 'చంద్రముఖి 2' కూడా నిరాశపరుస్తుందో లేదంటే మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
