మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో ప్రారంభమైన ‘స్పిరిట్’.. మరి ప్రభాస్ ఎక్కడ?
on Nov 23, 2025
రెబల్‌స్టార్ ప్రభాస్, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్’ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు నవంబర్ 23న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. మెగాస్టార్ క్లాప్‌తో స్టార్ట్ అయిన ఈ పూజా కార్యక్రమాల్లో సందీప్‌రెడ్డి వంగా, నిర్మాతలు, త్రిప్తి డిమ్రి పాల్గొన్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు.
ప్రభాస్ లుక్ టెస్ట్ ఇప్పటికే పూర్తయింది. ప్రభాస్ లుక్ అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ప్రకాశ్‌రాజ్, వివేక్ ఒబెరాయ్, డాన్ లీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తారు. దగ్గుబాటి అభిరామ్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.
‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్‌రెడ్డి.. ఆ సినిమాలను మించే స్థాయిలో ‘స్పిరిట్’ చిత్రాన్ని రూపొందిస్తారని తెలుస్తోంది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ నటించే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. హై ఓల్టేజ్‌లో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్, భారీ ఎమోషన్స్‌తో ప్రభాస్ కెరీర్‌లోనే ఓ మైల్‌స్టోన్‌లాంటి సినిమాగా ‘స్పిరిట్’ రూపొందనుంది.
నవంబర్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సందీప్‌రెడ్డి సినిమాల్లోని క్యారెక్టర్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయానికి వస్తే అంతకుమించి అన్నట్టుగా క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ప్రభాస్ సినిమాల కంటే వేగంగా ఈ సినిమాను పూర్తి చేస్తారని సమాచారం. అందుకే ఈసారి తన డైరెక్షన్ టీమ్‌లోకి 20 మందిని తీసుకున్నారు సందీప్. వారిలో త్రివిక్రమ్ కుమారుడు రిషి మనోజ్, రవితేజ కుమారుడు మహాధన్ కూడా ఉన్నారని తెలుస్తోంది. యానిమల్ చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తి చేశాడు సందీప్. ఇప్పుడు స్పిరిట్‌కి సెట్ చేసుకున్న టీమ్‌తో అంతకంటే వేగంగా సినిమాను పూర్తి చెయ్యాలని డిసైడ్ అయ్యాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



