అఖండ 2 చూసిన యోగి ఆదిత్యనాథ్.. రిపోర్ట్ ఇదే
on Nov 23, 2025

అఖండ 2 పై యోగి ఆదిత్యనాధ్ రిపోర్ట్ ఏంటి!
త్రిశూలాన్ని బహుకరించిన చిత్ర బృందం
బాలయ్య శివ తాండవం చూడటానికి రెడీనా
ట్రైలర్ రిలీజ్ తో భారీ అంచనాలు
ఇంకెన్ని రెండు వారాలు.. రెండంటే రెండు వారాలు.. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)చేసే శివ తాండవంతో పాన్ ఇండియా థియేటర్స్ కళకళ లాడానికి ఉన్న సమయం. ఈ లోపు యాజమాన్యం తమ థియేటర్స్ ని పక్కాగా రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి. అఖండ సౌండ్ కి కొన్ని థియేటర్స్ లో సౌండ్ బాక్స్ లు తట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో అఖండ 2 కి సరికొత్తగా ముస్తాబవక తప్పదు. మల్టిప్లెక్స్ కి కూడా మినహాయిపు లేదు.
ఇక బాలయ్య, బోయపాటి(Boyapati srinu)తో పాటు చిత్ర బృందం మొత్తం జెట్ స్పీడ్ వేగంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నిన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్' ని కలవడం జరిగింది. అఖండ 2 యొక్క కథా నేపధ్యాన్ని యోగి ఆదిత్యనాథ్ కి వివరించడంతో పాటు చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలని చూపించారు. మూవీలో శివస్తుతుడుగా బాలయ్య చేతబూనిన త్రిశూలాన్ని కూడా ఆయనకి అందచేశారు. అనంతరం భక్తి, ధర్మం ప్రధానంగా అఖండ 2 ని నిర్మించడంపై బాలయ్య, బోయపాటి ని యోగి ఆదిత్యనాథ్ అభినందించడం జరిగింది. సుదీర్ఘ కాలం నుంచి దైవ సేవకుడిగా కాషాయ వస్త్రాలు ధరిస్తూ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్న యోగి ఆదిత్యనాథ్ ని చిత్ర బృందం కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
also read: మరో తెలుగు దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య!
ఇక అఖండ 2 కథ విషయానికి వస్తే భారత దేశాన్ని అపకీర్తిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే ధర్మమే త్రిశూలం పట్టుకొని యుద్దానికి దిగితే ఎలా ఉంటుందో అనే అంశాలతో తెరకెక్కింది. ట్రైలర్ తో ఈ విషయం అర్దమవ్వడంతో అసేతు హిమాచాలం అఖండ 2 రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. 14 రీల్స్ , బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతలు కాగా మరో శివస్తుతుడు తమన్(Thaman) మ్యూజిక్. ఆదిపినిశెట్టి(Aadhi Pinisetty)ప్రతినాయకుడు కాగా సంయుక్త మీనన్(samyuktha menon)హీరోయిన్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



