సర్ప్రైజ్... చెప్పిన టైమ్ కంటే ముందే విక్రమాదిత్యగా వచ్చిన ప్రభాస్!
on Oct 21, 2020
యంగ్ రెబెల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులకు బుధవారం ఓ సర్ప్రైజ్ ఉందని 'రాధే శ్యామ్' సినిమాలో అతని సరసన నటిస్తున్న పూజా హెగ్డే మంగళవారం సాయంత్రమే చెప్పింది. అదేమై ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రేక్షకులకు నిజంగా అది సర్ ప్రైజే. ఈ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ లుక్ ను బుధవారం ఉదయం విడుదల చేశారు. అతడు విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నాడని వెల్లడించారు.
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... 'రాధే శ్యామ్'లో ప్రభాస్ కొత్త లుక్ అభిమానులను అమితంగా అలరించింది. గ్రీకు కట్టడాలు, వింటేజ్ కార్లు, ప్రభాస్ దుస్తులు, స్టైల్ చాలా కొత్తగా ఉన్నాయి. ప్రతి సినిమాకి మేకోవర్ పరంగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రభాస్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తాడని ఈ స్టిల్ చూస్తుంటే అర్థమవుతోంది.
'రాధే శ్యామ్' విషయంలో చిత్ర నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ మీద ప్రభాస్ అభిమానులు కొన్ని రోజులుగా ఆగ్రహంతో ఉన్నారు. ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదని సోషల్ మీడియా లో సెటైర్లు వేశారు. చెప్పిన సమయానికి ఏదీ విడుదల చేయరని గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం 'రాధే శ్యామ్' టీజర్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 23న విడుదల చేస్తామని ప్రకటించిన యువి క్రియేషన్స్... ప్రభాస్ కొత్త స్టిల్ విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ చేసింది. ఈసారి చెప్పిన టైం కంటే ప్రభాస్ ముందే వచ్చాడు.
Also Read