బీ అలర్ట్.. అజ్ఞాతవాసికి లీకేజీ రాయుళ్ల వార్నింగ్..?
on Dec 5, 2017

పైరసీ సినీ పరిశ్రమకు పక్కలో బల్లెంలా తయారైంది. గతంలో సినిమా రిలీజైన రెండు, మూడు రోజులకి మార్కెట్లోకి డీవీడీల రూపంలో మొత్తం మూవీ బయటికి వచ్చేసేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని రిలీజైన నిమిషాల్లోనే.. అంతేందుకు ధియేటర్ నుంచే లైవ్ టెలీకాస్ట్ అయిన ఘటనలు ఎన్నో. ఇక సినిమాపై హైప్ పెంచేందుకు గాను మూవీకి సంబంధించిన ఎలాంటి పిక్స్, వీడియోస్ బయటికి రానివ్వరు దర్శకనిర్మాతలు. సెట్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ.. ఇక్కడా మన లీకేజీ వీరులు ఎంటరై.. కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. చిత్ర యూనిట్‌కి ఈ విషయం తెలిసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
రీసెంట్‌గా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఈ సంగతి నిర్మాతకు తెలియడంతో వారు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు ఫిలింనగర్ టాక్. గతంలో పవన్-త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఫస్టాఫ్ మొత్తం బయటకు వచ్చేసింది. నిర్మాత క్షేమాన్ని కోరి.. పవర్‌స్టార్ స్వయంగా రంగంలోకి దిగి సినిమాను థియేటర్లలోనే చూడాల్సిందిగా ప్రేక్షకులను కోరడంతో.. అత్తారింటికి దారేది సేఫ్‌గా బయటపడటమే కాకుండా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తాజాగా అజ్ఞాతవాసి మేకింగ్ పిక్స్ బయటకు రావడం చూస్తుంటే.. లీకేజీ వీరులు ఈ సినిమాపై ఏ రేంజ్‌లో ఫోకస్ పెట్టారో అర్థమవుతుంది. ఇక నుంచైనా ఈ మూవీ యూనిట్ జాగ్రత్తపడటం మంచిది అంటున్నారు ఫిలింనగర్ జనాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



