దేవరకొండ విజయ్ సినిమాకు ఊర మాస్ టైటిల్!
on Dec 5, 2017
.jpg)
దేవరకొండ విజయ్ మామూలు సుడిగాడు కాదండీ బాబూ. మనోడికి పడుతున్న సినిమాలు అలాగే ఉన్నాయ్. టైటిళ్లూ అదే రేంజ్ లో ఉంటున్నాయ్. ‘పెళ్లి చూపులు’ అనగానే ముందు ఆ టైటిల్ గురించే మాట్లాడుకున్నారు. ‘అర్జున్ రెడ్డి’ అనగానే చెప్పేదేముందీ.. ఆ టైటిలే టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యింది. ఇప్పుడు ఈ గోలంతా దేనికి? అనుకుంటున్నారా? మనోడి రాబోతున్న సినిమా టైటిల్ కూడా ఇదే రేంజ్ లో మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉంది. నిజానిి సూపర్ స్టార్ల సినిమాకు పెట్టాల్సిన టైటిల్ అది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటా అనుకుంటున్నారా? ‘టాక్సీ వాలా’. ఇంత ఊర మాస్ టైటిల్ అప్పుడే దేవరకొండ విజయ్ కి అవసరమా? అని కూడా చాలామంది ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఏమో.. చెప్పలేం... ‘ఎవడే సుబ్రమణ్యం’ చూసినప్పుడు ’ కుర్రాడెవరో బాగా చేస్తున్నాడే’ అన్నారు. ‘పెళ్లి చూపులు’ చూసినప్పుడు.. తెలుగు సినిమా మంచి హీరో దొరికాడు అన్నారు. ‘అర్జున్ రెడ్డి’ రాగానే... ఇకనుంచి టాలీవుడ్ టాప్ స్టార్ లో తనూ ఒకడని కితాబిచ్చేశారు. మరి రేపు ‘టాక్సీవాలా’తో ఇంకేం అంటారో. ! ముందు ముందు ఇంకెన్ని చూడాలో. !
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



