ప్రెగ్నెన్సీతో వున్న పూర్ణను పరుగెత్తించిన డైరెక్టర్!
on Sep 30, 2023
ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకే సినిమాలు ఉన్నాయి. వినోదం అయినా, యాక్షన్ అయినా.. మరేదైనా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేందుకు నటీనటులు కొన్నిసార్లు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఔట్‌ఫుట్ బాగా వచ్చేందుకు కొందరు నటీనటులు ఎంతో రిస్క్ చేస్తారు. వారు చేసిన సీన్స్‌ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ కష్టాన్ని మరచిపోతుంటారు. అలాంటి ఓ అనుభవాన్ని హీరోయిన్ పూర్ణ ప్రేక్షకులతో పంచుకుంది. నాని హీరోగా నటించిన ‘దసరా’ మూవీ షూటింగ్‌లో తాను ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం తను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే పూర్తి చేసిందట.
ఎక్కువ సీన్స్ నైట్ ఎఫెక్ట్‌లోనే ఈ మూవీ డైరెక్టర్ చేశారని, అయితే ఆ చలిని తాను తట్టుకోలేకపోయానని చెప్పింది. రాత్రి టైమ్‌లోనే ఓ సీన్ చేస్తున్నప్పుడు నిర్మానుష్యమైన రోడ్డుపై పరిగెత్తాల్సి వచ్చిందని, అప్పుడు వీధి కుక్కలు వెంటపడ్డాయని, వాటి అరుపులకు భయపడ్డానని చెప్పింది. ఆ టైమ్‌లో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా చేసిన ఆ సీన్ తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది అంటూ ‘దసరా’ షూటింగ్ అనుభవాలను గుర్తు చేసుకుంది. గత ఏప్రిల్‌లో పూర్ణ మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను చూసుకుంటూనే టీవీ షోల్లో, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోంది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అవును’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు హీరోయిన్‌గా ఆశించినంత గుర్తింపు రాలేదు. సినిమాలనే నమ్ముకోకుండా కొన్ని టీవీ షోల్లో కూడా కనిపిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
