మధురపూడి గ్రామం అనే నేను : ఒక ఊరి ఆత్మ కథ
on Sep 30, 2023
ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషికి చావు అనేది ఒకటి ఉంటుంది.చనిపోయిన మనిషి ఆత్మగా మారతాడని బతికున్నప్పుడు ఆ మనిషి యొక్క కోరికలు నెరవేరకపోతే ఆత్మగా తిరుగుతుంటాడని అంటారు.మనిషి యొక్క ఆత్మ గురించి చాలా సినిమాలు వచ్చి విజయం సాధించాయి.ఇప్పుడు సరికొత్తగా ఒక ఊరి కి ఆత్మ ఉందని ఆ ఆత్మ తన కథ ని ఎందుకు చెప్పాలసివస్తుందని అసలు ఆత్మ ఏమేమి చేసిందనే ఒక ఆసక్తికరమైన పాయింట్ తో కూడిన సినిమా ఒకటి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
శివ కంఠంనేని హీరోగా క్యాథలిన్ గౌడ హీరోయిన్లుగా మధురపూడి గ్రామం అనే సినిమా అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధం అవుతుంది.ఇప్పుడు ఈ సినిమా యొక్క కథ తెలుగు సినిమా ప్రేక్షకులలో సినిమా మీద అంచనాలని పెంచేలా చేసింది.అసలు ఒక ఊరికి ఆత్మ ఉంటే అనే పాయింట్ చాలా కొత్తగా ఉండటం తో పాటు ఆ ఊరి ఆత్మ తన కథని తానే ఎలా చెప్పుకుంది పైగా అందులో హీరో హీరోయిన్ లు పోషించే పాత్రలు ఎలా ఉంటాయి అనే ఒక ఆతృత సినిమా ప్రేక్షకుల్లో ఉంది.విభిన్నమైన స్క్రీన్ ప్లే తో మల్లి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మధురవాడ గ్రామం మూవీ యొక్క కథ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ని ఒంగోలు చీరాల అనే నగరాల నేపథ్యం లో జరగడం సినిమా మీద అమాంతం అంచనాలని పెంచేలా చేసింది. సస్పెన్సు థ్రిల్లర్ తో పాటు ప్రేమ ,యాక్షన్ ,స్నేహం ,రాజకీయం ,ఎమోషన్ ల నేపధ్యం లో తెరకెక్కతున్న ఈ సినిమాని ఆర్ .వెంకటేశ్వరావు .కేఎస్ శంకరరావు లు సంయుక్తముగా నిర్మించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
