దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే?
on May 18, 2020
ప్రజెంట్ టాలీవుడ్‌లో డైరెక్టర్స్ హాట్ ఫెవరెట్ హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే పేరు ముందువరుసలో గట్టిగా వినపడుతుంది. మేడమ్ సార్ మేడమ్ అంతే! యాక్టింగ్ గ్లామర్‌కి తోడు పర్ఫార్మెన్స్ బాగా చేస్తుండడంతో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకోవాలనుకొనే దర్శకులు సంఖ్య పెరుగుతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అందులో దుల్కర్ సరసన కథానాయికగా పూజా హెగ్డేను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆల్రెడీ ఆమెకు కథ చెప్పారట. కథ, అందులో పాత్ర ఆమెను నచ్చాయని సమాచారం. అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' తర్వాత ఈ సినిమా చేయనున్నారని టాక్.
'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీర ప్రేమగాధ', 'లై', 'పడి పడి లేచె మనసు' తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. దుల్కర్ సల్మాన్ మలయాళ హీరో. అయితే, అతడికి తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ సినిమాలు చేశాడు. డబ్బింగ్ సినిమాలు 'ఓకే బంగారం', 'కనులు కనులను దోచాయంటే' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్, 'మహానటి'తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశాడు. 'మహానటి' తర్వాత దుల్కర్ తెలుగులో నటిస్తున్న స్ట్రయిట్ సినిమా ఇదే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
